Shannu Deepu Breakup: బ్రేకప్‌పై దీప్తి క్లారిటీ.. ఇది తన నిర్ణయం అంటున్న షణ్నూ..

Shannu Deepu Breakup: దీప్తి సునయన, షణ్ముఖ్ జశ్వంత్.. ఈ ఇద్దరు డబ్ స్మాష్ వీడియోలతో మొదలుపెట్టి, కవర్ సాంగ్స్ చేసి.. షార్ట్ ఫిల్మ్స్‌తో ఫేమస్ అయిన యూట్యూబ్ జంట. ఈ ఇద్దరి పెయిర్ అంటే ఇప్పటికీ చాలామందికి ఇష్టం. కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న సమయం నుండే వీరిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ప్రచారం సాగుతూ ఉండేది. కపుల్ టాటూతో ఈ రూమర్స్ నిజమే అని ప్రూవ్ చేసుకున్నారు దీప్తి, షణ్ము.
అయితే వీరిద్దరు ప్రేమలో పడి అయిదు సంవత్సరాలు అయిపోయింది. ఈ అయిదు సంవత్సరాల రిలేషన్‌షిప్‌కు చెక్ పెడుతూ దీప్తి సునయన.. షణ్మూతో బ్రేకప్ చెప్పేసింది. గత కొన్ని రోజులుగా వీరిద్దరు బ్రేకప్ చేసుకోనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ నుండి షణ్నూ బయటికి వచ్చినప్పటి నుండి దీప్తి తనను కలవకపోవడం ఈ రూమర్స్‌కు మరింత ప్రాణం పోసింది. తాజాగా ఈ రూమర్స్ నిజమంటూ దీప్తి క్లారిటీ ఇచ్చేసింది.
గత అయిదు సంవత్సరాలు వారి రిలేషన్‌షిప్ ఎలా ఉందో వివరిస్తూ.. వారి దారులు వేరులు అంటూ బ్రేకప్ విషయాన్ని బయటపెట్టింది దీప్తి సునయన. 'మేమిద్దరం కలిసి చాలా కాలం కలిసి ఉండాలనుకున్నాం కానీ అది కుదరట్లేదు. మా దారులు వేరు అని మాకు అర్థమయ్యింది' అంటూ పోస్ట్ పెట్టింది. ఈ కష్ట సమయంలో తనకు అండగా ఉన్న వారందరికీ థాంక్యూ చెప్పింది దీప్తి.
దీప్తి నిర్ణయాన్ని షణ్నూ ఏకీభవించాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి తనకు అన్ని హక్కులు ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. తాను ఇప్పటివరకు చాలా ఎదుర్కుందని, ఇప్పటికైనా తాను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాని తెలిపాడు. అయిదు సంవత్సరాల నుండి తనకు తోడుగా ఉన్నందుకు దీప్తికి థాంక్స్ చెప్తూ.. తాను ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు షన్నూ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com