Shannu Deepthi: దీప్తిని చూసి చాలా నేర్చుకున్నా: షణ్నూ కామెంట్స్ వైరల్

Shannu Deepthi: దీప్తిని చూసి చాలా నేర్చుకున్నా: షణ్నూ కామెంట్స్ వైరల్
Shannu Deepthi: ఇద్దరి జోడీ భలే బావుంటుంది. క్యూట్‌గా ఉంటారు. వెరీ టాలెంటెడ్ పర్సన్స్. ఈ ప్రేమ పక్షులు విడిపోవడానికి బిగ్‌బాస్ హౌసే కారణమైంది.

Shannu Deepthi: ఇద్దరి జోడీ భలే బావుంటుంది. క్యూట్‌గా ఉంటారు. వెరీ టాలెంటెడ్ పర్సన్స్. ఈ ప్రేమ పక్షులు విడిపోవడానికి బిగ్‌బాస్ హౌసే కారణమైంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మళ్లీ కలిసిపోతే బావుండు అని షణ్నూ, సునయన అభిమానులు ఆశ పడ్డారు. కాలం అన్ని గాయాలను మాన్పేస్తుంది అంటారు కదా. అదే ఈ జంట విషయంలో కూడా నిజం కానుందేమో. అందుకే షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన ఒకే వేదిక మీద కనిపించారు.

వైజాగ్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో వీరిద్దరూ సందడి చేశారు. పక్కనే కూర్చున్న దీప్తిని చూస్తూ షణ్నూ సిగ్గుపడుతున్న క్లిప్పింగ్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. స్టేజ్‌పైన దీప్తి గురించి మాట్లాడుతూ.. నేను, దీప్తి కవర్ సాంగ్స్ చేసేటప్పుడు చాలా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.


ఆమెపై వచ్చినన్ని ట్రోల్స్ ఎవరిపైనా వచ్చి వుండవు. అయినా దీప్తి ఎప్పుడూ వాటిని మనసుకు తీసుకోలేదు. దీప్తిని చూసి నేను చాలా నేర్చుకున్నాను. అలాగే అమ్మాయిలు కూడా ఆమెను చూసి నేర్చుకోవాలి. మీరు కూడా ఒక ఇన్‌స్పిరేషన్ కావాలి అని షణ్ముఖ్ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరూ మళ్లీ కలిసిపోయారని అభిమానులు ఆనందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story