Shanmukh Jaswanth: కొత్తింట్లోకి అడుగుపెట్టిన షణ్ముఖ్.. ప్రేమికుల రోజు ఇద్దరూ..

Shanmukh Jaswanth: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ కొత్తింట్లోకి అడుగుపెట్టాడు.. చాయ్ బిస్కెట్ ఫేం శ్రీవిద్యతో కలిసి కొత్త ఇంట్లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. బిగ్‌బాస్ సీజన్ 5లోకి ఎంట్రీ ఇచ్చి రన్నరప్‌గా నిలిచిన షణ్ముఖ్ అనేక వివాదాలు మూటగట్టుకున్నాడు.. హౌస్‌లో సిరితో సాగించిన వ్యవహారం నచ్చక లవర్ దీప్తి సునయన బ్రేకప్ చెప్పింది.
ఆ విరహ వేదన తట్టుకోలేక మైలవ్ ఈజ్ గాన్ అంటూ ఎమోషన్ డ్యాన్స్ ఫెర్‌ఫామెన్స్ ఇచ్చాడు షణ్నూ స్టార్ మాలో. ఇక ఇదే విషయాన్ని ప్రస్తావించకపోయినా నేనెదైనా మాట్లాడేముందు ఆలోచించను అని దీప్తి పోస్ట్ పెట్టడం షణ్నూ అభిమానుల్లో సందేహానికి దారి తీస్తుంది..
ఆమె చెప్పిన బ్రేకప్ ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే స్టార్ మాలో దీప్తి కూడా ఓ షో చేయనున్నట్లు తెలుస్తోంది. అదే కనుక నిజమైతే ఇద్దరూ మళ్లీ ఆ ప్రోగ్రామ్ ద్వారా కలుసుకుంటారేమోనని అభిమానులు ఆశిస్తున్నారు.
తప్పులేదు.. సడెన్‌గా తీసుకున్న నిర్ణయాలకు అంత విలువ వుండదు.. ఆలోచిస్తే అతడే కరెక్ట్ అనిపించి ఉండవచ్చు దీప్తి సునయనకి. వాలెంటైన్స్ డే నాటికి ఈ ప్రేమికులు ఇద్దరు కలుసుకుంటారని అనుకుంటున్నారు అంతా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com