Bigg Boss 5 Telugu: కాజల్, షన్నూకు మధ్య గొడవకు కారణం తనేనా..?

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షోలో ముందు ఉన్నట్టుగా తరువాత ఎవరు ఉండలేదు. చాలావరకు హౌస్‌మేట్స్ ఓ గేమ్ ప్లాన్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తారు. కానీ.. కొన్ని వారాలు గడిచేకొద్దీ ఆ గేమ్ ప్లాన్ అంతా మారిపోతుంది. అలాగే మొదట్లో బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండేవారు కూడా మెల్లగా బద్ద శత్రువుల్లాగా మారే అవకాశం ఉంది. కాజల్, షన్నూ కూడా అలాగే అయ్యారు.
కాజల్, షన్నూలకు బయట మంచి సాన్నిహిత్యమే ఉంది. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత కూడా కొంతకాలం అదే కంటిన్యూ అయ్యింది. కాజల్, షన్నూ, సిరి, జెస్సీ ఓ టీమ్‌లాగా కలిసి ఉండేవారు. అదే సమయంలో కాజల్.. ఆ గ్రూప్ తనను దూరం పెడుతున్నారు అని భావించేది. మెల్లగా అక్కడ నుండి సైడ్ అయిపోయి సన్నీ, మానస్‌తో స్నేహం చేయడం మొదలుపెట్టింది.
అయితే సిరి వల్ల షన్నూకు ఆడియన్స్‌లో నెగిటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది అనుకొని కాజల్ వారిని దూరం పెడిందేమో అని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సన్నీ, మానస్‌లతో కలిస్తే తన గేమ్ సాఫీగా సాగిపోతుంది అనుకుంది కాబట్టే వారితో ఫ్రెండ్‌షిప్ మొదలుపెట్టింది అనుకునేవారు కూడా ఉన్నారు. దాన్నే సేఫ్ గేమ్ అని కూడా అంటున్నారు.
ఇటీవల హౌస్‌మేట్స్.. ప్రేక్షకులు అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు ఒక నెటిజన్ కాజల్‌ను ఇదే ప్రశ్న అడిగాడు. ముందుగా షన్నూ గ్రూప్‌లో ఉండే తాను ఉన్నట్టుండి సన్నీ గ్రూప్‌లోకి మారడానికి కారణమేంటి అని, అది తన గేమ్ ప్లానా అని.. దీనికి కాజల్ మామూలుగా సమాధానం చెప్పి తప్పించుకుంది. ఇక ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో కాజల్.. హిట్ స్టార్‌గా సన్నీని, ఫ్లాప్ స్టార్‌గా షన్నూను నిలబెట్టింది. అంతే కాక ఈ వారం కాజల్.. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అవుతుందని కూడా టాక్ వినిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com