Tollywood : శతమానం భవతి జోడీ రిపీట్

Tollywood : శతమానం భవతి జోడీ రిపీట్
X

చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన కెరీర్లో తొలి పాన్ ఇండియా చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. సంపత్ నంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 1960ల చివర్లో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన కథ ఆధారంగా ఈమూవీ రాబోతుంది. మరపురాని అనుభూతిని కలిగించే పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. మే ఫస్టు వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దీనికోసం హైదరాబాద్ సమీపంలో 15 ఎకరా ల్లో ఓ భారీ సెట్ను సిద్ధం చేశారు. ఎక్కువ భాగం షూటింగ్ మొత్తం అక్కడే పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా మూవీ మేకర్స్ సాలిడ్ అప్డేట్ వచ్చారు. ఈచిత్రంలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించబో తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అనుపమకు సంబంధించి ఓ ప్రీలుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. గతంలో శర్వానంద్, అనుపమ కలిసి 'శతమానం భవతి'లో నటించారు. దిల్ రాజ్ నిర్మాణంలో 2017లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఉత్తమ ప్రజా దరణ పొందిన చిత్రంగానూ జాతీయ అవార్డు ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ జోడీ మళ్లీ తెరపై సందడి చేయడానికి సిద్ధం కావడంతో ఫ్యాన్స్సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story