Khushboo : రజినీకాంత్ సినిమాలో నటించకుండా ఉండాల్సింది : ఖుష్బూ

Khushboo : రజినీకాంత్ సినిమాలో నటించకుండా ఉండాల్సింది : ఖుష్బూ
X

రజినీకాంత్ సినిమాలో నటించినందుకు ఫీలవుతోంది సీనియర్ నటి ఖుష్బూ.. కొన్నేళ్ల కిందట ఆయన హీరోగా వచ్చిన అన్నాత్తె చిత్రంలో క్యారెక్టర్ రోల్ చేసింది. ఇందులో మరో సీనియర్ నటి మీనా కూడా అలాంటి పాత్రలోనే నటించింది. వీళ్లిద్దరి స్థాయికి తగిన పాత్రలు కావవి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినిమా పేరు చెప్పకుండా విషయాన్ని చెప్పేసింది ఖుష్బూ. తాను ఇప్పటిదాకా చాలా సినిమాల్లో నటించానని, దక్షిణాదిన నేను చేసిన కొన్ని సినిమాల గురించి ఆలోచిస్తే.. వాటిలో ఓ సినిమాలో భాగం కాకుండా ఉంటే బాగుంటుందని అనిపిస్తుందని చెప్పింది. కొన్నేళ్ల కిందట విడుదలైన రజినీకాంత్ సినిమా అలాంటిదేనని.. నరేషన్ టైంలో నా పాత్ర గురించి చెప్పిన విధంగా స్క్రీన్ మీదికి తీసు కురాలేదని తెలిపింది. ఆ మూవీలో తాను, మీనా నటించామని చెప్పింది. తమవే కీలక పాత్రలు అని మొదట్లో చెప్పారని తెలిపింది. రజినీతో డ్యూయెట్స్ కూడా ఉంటాయన్నారని చెప్పింది. రజినీకి జోడీగా వేరే హీరోయిన్ ఉండదని భావించి ఆ సినిమా అంగీకరించా నని చెప్పింది. తన పాత్ర తనకెంతో నచ్చిందని తెలిపింది. కానీ సినిమా తెరకెక్కే సమయానికి అంతా మారిపోయిం దని.. నిజానికి ఆ సినిమాలో చేసి ఉండాల్సింది కాదని గతాన్ని గుర్తు చేసుకుంది ఖుష్బూ

Tags

Next Story