Shivangi First Look : శివంగి మాస్ లుక్.. ఇరగదీసిన ఆనంది

Shivangi First Look : శివంగి మాస్ లుక్.. ఇరగదీసిన ఆనంది
X

ఆనంది, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'శివంగి', దేవరాజ్ భరణి ధరన్ దర్శకత్వంలో రూపొందుతోంది. నరేష్ బాబు పి. నిర్మిస్తున్నారు. ఉమెన్ సెంట్రిక్ చిత్రమిది. జాన్ విజయ్, డా. కోయ కిషోర్ కీలక పాత్రధారులు. ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. నలుపు లుంగీ, చొక్కాతో కాళ్ళపై కాళ్లు వేసుకొని, సోఫాలో కూర్చున్న ఆనంది లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రానికి ఏహెచ్ కాషిప్, ఎబినేజర్ పాల్ సంగీతం, భరణి కె. ధరన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మార్చి ఏడవ తేదీన సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags

Next Story