Tollywood : గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.... పెద్ది లుక్ అదుర్స్

Tollywood : గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.... పెద్ది లుక్ అదుర్స్
X

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పెద్ది. మార్చి 27, 2026 (రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా). ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఇందులో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన 'గౌర్ నాయుడు ' అనే పాత్రలో కనిపించనున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పెద్ద మీసాలు, గంభీరమైన చూపుతో ఆయన లుక్ పవర్ ఫుల్ గా ఉంది. ఈ సినిమా గ్రామీణ క్రీడల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక 'ఆట కూలీ' పాత్రలో కనిపించనున్నారు. ఆయన లుక్ చాలా రస్టిక్ గా, ఊర మాస్ గా ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్లలో రామ్ చరణ్ చిరిగిన దుస్తులు, గుబురు గడ్డం, ముక్కుకు రింగ్ తో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో ఆయన క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి వివిధ క్రీడల్లో పాల్గొంటారని తెలుస్తోంది. రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' తర్వాత నటిస్తున్న సినిమా ఇది. 'పెద్ది'తో రామ్ చరణ్ మరోసారి పవర్ ఫుల్ పల్లెటూరి మాస్ పాత్రలో కనిపించనున్నారు.

Tags

Next Story