Most Popular Actresses :టాప్ 10లో శోభిత, సమంత

Most Popular Actresses  :టాప్ 10లో శోభిత, సమంత
X

ఎంటర్ టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ తాజాగా మోస్ట్ పాపులర్ నటీ నటుల జాబితా విడుదల చేసింది. ఈ ఏడాదిలో ఆన్ లైన్ లో ఎక్కువగా వెతికిన హీరోయిన్ల జాబితాలో త్రిప్తి డిగ్రీ ముందు నిలిచింది. వరల్డ్ వైడ్ గా 250 మిలియన్ల మంది వీక్షించిన పేజీల ఆధారంగా దీనిని ఫైనల్ చేసినట్లు తెలిపింది. ఈ జాబితాలో త్రిప్తి డిమ్రీ ముందు నిలిచింది. ఆమె నటించిన 'బ్యాడ్ న్యూజ్', 'లైలా మజ్ను' రీరిలీజ్తో పాటు ‘భూల్ భులయ్యా3' చిత్రాలు విడుదలైన విషయం తెలిసిందే. అందుకోసమే ఈమెను నెటిజెన్లు వెతికినట్టు తెలుస్తోంది. రెండో స్థానంలో నటి దీపికా పదుకొణె, థర్డ ప్లేస్ లో నటుడు ఇషాన్ ఖత్తర్ ఉన్నారు. నాలుగో స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నిలిచారు. టాప్ 5లో నటి శోభిత ధూళిపాళ ఉన్నారు. సినీనటుడు నాగచైతన్యతో పెళ్లి,

ఆమె నటించిన మంకీ మ్యాన్ విడుదల నేపథ్యంలోనే శోభిత ఐదో ప్లేస్ లో నిలిచినట్టు తెలుస్తోంది. ఆరు, ఏడు స్థానాల్లో శార్వరీ, ఐశ్వర్యరాయ్ ఉన్నారు. ఎనిమిదో స్థానాన్ని స్టార్ హీరోయిన్ సమంత కైవసం చేసుకున్నారు. సామ్ నటించిన 'సిటడెల్: హనీ బన్నీ ' ప్రేక్షకుల ముందుకువచ్చింది. అదే సమయంలో ఆమె ఆరోగ్యం.. నాగచైతన్య రెండో వివాహం నేపథ్యంలో ఆమె స్పందన ఎలా ఉందన్న విషయాలపై ఆసక్తితో వెతికినట్టు భావిస్తున్నారు

Tags

Next Story