Shobhita Dhulipala : పెళ్లి కూతురైన శోభిత

అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల ఈ నెల 4న వైవాహిక బంధంలో ఒక్కటవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి హల్దీ ఫంక్షన్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవాల శోభితను పెళ్లికుమార్తెగా ముస్తాబు చేశారు. మంగళ హారతులు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను శోభిత తాజాగా నెటిజన్లతో పంచుకున్నారు. ఇందులో ఆమె సంప్రదాయ చీర కట్టులో మెరిసిపోతూ సిగ్గులొలికించారు. డిసెంబర్ 4న రాత్రి 8.13 గంటలకు నాగచైతన్య- శోభితల వివాహం జరగనుంది. అక్కినేని కుటుంబం ప్రత్యేకంగా భావించే హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ పెళ్లి వేడుక నిర్వహించనున్నారు. స్టూడియోలోని ఏయన్నార్ విగ్రహం వద్ద పెళ్లి జరగనుందని ఇప్పటికే చైతన్య చెప్పారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com