Rishab Shetty : ‘కాంతార: చాప్టర్ 1’ షూటింగ్‌లో షాకింగ్ ఘటనలు: రిషబ్ శెట్టి సంచలన వ్యాఖ్యలు

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ కాంతార: చాప్టర్ 1 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది. తెలుగులో ప్రభాస్, హిందీలో హృతిక్ రోషన్, తమిళంలో శివ కార్తికేయన్ ట్రైలర్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
కాగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. షూటింగ్ సమయంలో తనకు జరిగిన ప్రమాదాల గురించి ఆయన చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. “‘కాంతార: చాప్టర్ 1’షూటింగ్ సమయంలో అనేక సార్లు తానుచావు అంచులకు వెళ్లి వచ్చాను” అని రిషబ్ శెట్టి తెలిపారు. అంతేకాకుండా, సినిమా యూనిట్ సభ్యులలో కొందరు అనుకోకుండా మరణించడం తమను నిరాశలోకి నెట్టిందని చెప్పారు. అన్ని సవాళ్లను ఎదుర్కొని సినిమాను సమయానికి పూర్తి చేయడానికి అందరూ చాలా కష్టపడ్డారని రిషబ్ శెట్టి చెప్పారు. “మేము మూడు నెలలుగా నిద్రలేని రాత్రులు గడిపాము. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం తీవ్రంగా శ్రమించారు. సెట్‌లో ఎదురైన ప్రమాదాల మధ్య దైవత్వం మాకు రక్షణగా నిలిచింది” అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాలు తెలిసిన నెటిజన్లు రిషబ్ శెట్టి అంకిత భావాన్ని, కృషిని ప్రశంసిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com