Tollywood : మేలో ఎల్లమ్మ మూవీ షూటింగ్!

Tollywood : మేలో ఎల్లమ్మ మూవీ షూటింగ్!
X

‘బలగం’తో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వేణు తెరకెక్కించే కొత్త సినిమా ‘ఎల్లమ్మ’ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నితిన్ హీరోగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ మే నెలలో ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించిన వేణు.. తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ముంబైకి వెళ్లారు. మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్-అతుల్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఇక ‘బలగం’ అనే సినిమాతో దర్శకుడిగా మారిన వేణు.. ఈ సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు దర్శకుడిగా ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు.ప్రియదర్శి (Priyadarshi ), కావ్య కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో.. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు పలు అవార్డులు కూడా అందుకుంది. ముఖ్యంగా లాస్ ఏంజెల్స్ లో సినిమాటోగ్రఫీ అవార్డులు, ఒనికో ఫిలిం అవార్డులు వంటి అంతర్జాతీయ అవార్డులు కూడా లభించాయి.

ఇక కుటుంబ నాటక చిత్రంగా వచ్చిన ఈ సినిమాని దిల్ రాజు ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఇక ఇందులో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ తో పాటు సుధాకర్ రెడ్డి, కోట జయరాం, మురళీధర్ గౌడ్, మధు తదితరులు కీలకపాత్రలు పోషించారు. 2023 మార్చి 3న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో మరెలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Tags

Next Story