Shriya Saran : శ్రియా శరణ్ స్పెషల్ సాంగ్

Shriya Saran : శ్రియా శరణ్ స్పెషల్ సాంగ్
X

కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుతో కలిసి సూర్య44 వర్కింగ్ టైటిల్ తో మూవీని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్దేకు జంటగా ఈమూవీలో ఆఫర్ దక్కించుకుంది. కాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే అండమాన్ లోని పోర్ట్ బ్లెయిర్ లో స్టార్ట్ అయింది. అయితే ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. మూవీలో శ్రియా శరణ్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై శ్రియా క్లారిటీ ఇచ్చింది. గోవాలో జరుగుతున్న్ ఐఫా 2024 ఈవెంట్ లో శ్రియా మాట్లాడుతూ.. 'కార్తీక్ సుబ్బరాజు, సూర్య ప్రాజెక్టులో భాగం కావడం చాలా ఎగ్జెటింగ్ గా ఉంది. ఈ మూవీలో నేను చేసిన స్పెషల్ సాంగ్ డిసెంబర్ లో రాబోతోంది' అని చెప్పుకొచ్చింది.

Tags

Next Story