Shriya : శ్రియ ఫైరింగ్ లుక్.. ఫోటోలు వైరల్!

ఇష్టం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్రియా శరణ్. తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో ఎనలేని అందంతో, నటనతో తనదైన ముద్ర వేసుకుంది. దాదాపు రెండు తరాల హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొని ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అభిమానులతో మాత్రం టచ్లోనే ఉంటోంది. ఇక ఈ బ్యూటీ చాలా కాలంగా తన స్టన్నింగ్ లుక్స్ సోషల్ మీడియాలోనూ షేక్ చేస్తోంది. 40 ఏండ్ల వయస్సులో కూడా ఈ అమ్మడు తన కెరీర్ లో గ్లామర్ పాత్రలకు ఎప్పుడూ వెనుకాడలేదు. ఇప్పుడు మళ్లీ ఓ బోల్డ్ అండ్ క్లాసీ లుక్తో నెట్టింటా హీట్ పెంచింది. తాజాగా ఇన్స్టాలో షేర్చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్లాక్ కలర్ శారీలో ట్రెడిషనల్ టచ్ ఉన్న ఈ పిక్స్.. మైనపు విగ్రహంలా కనిపించే లుక్స్, ఎక్స్ప్రెషన్స్ చూసిన నెటిజన్లు తెగ ఫిదా అవుతున్నారు. 'ఏజ్ జస్ట్ నంబర్', 'ఫైరింగ్ లుక్', 'గ్లామర్ కు నిర్వచనం శ్రియానే' అంటూ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా.. 2018లో శ్రియ శరణ్ రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్ను రహస్యంగా పెళ్లాడిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com