Heroin Shriya : శ్రియా సింగారం.. ఫోటోలు వైరల్

శ్రియా శరణ్ టాలీవుడ్ లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 2001లో తెరంగేట్రం చేసిన ఈ భామ టాలీవుడ్ అగ్రహీరోలందరి తోనూ ఆడిపాడింది. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ దాకా అందరి సరసన ఎన్నో బ్లాక్ బస్టర్స్ మూవీస్ తీసింది. 16 ఏండ్లకుపైగానే టాప్ హీరోయిన్ గా వెలిగింది. ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య పోటీ పెరగడంతో మెల్లిగా సైడైపోయింది. ఈ క్రమంగా ఫ్యామిలీ లైఫ్ షిఫ్ట్ అయిపో యింది ఈ చిన్నది. ప్రస్తుతం ఓ ఐటం సాంగ్ లో తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూపేందుకు రెడీ అవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న వరుస చిత్రాల్లో 'రెట్రో' ఒకటి. ఈ సినిమాలో శ్రియ ఐటం సాంగ్ ను ఇటీవలే షూట్ చేశారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా శ్రియ శరణ్ సోషల్ మీ డియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. సెకండ్ ఇన్నింగ్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన అందాలను ఆరబోస్తూ పోజులిస్తోంది. ఫొటోలోకు వాటిని ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేస్తోంది. 4.6 మిలియన్ల ఫాలోవ ర్లను కలిగి ఉన్న శ్రియా తాజాగా ప్రీ డ్రెస్డ్ సారీలో హొయలు పోయింది. ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కట్టుకొని రాజసాన్ని ప్రదర్శిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com