Shruti Haasan : హాలీవుడ్ లోకి శృతిహాసన్ .. ఏ సినిమా అంటే?

Shruti Haasan : హాలీవుడ్ లోకి శృతిహాసన్ .. ఏ సినిమా అంటే?
X

కమలాహాసన్ తయన, నటి శృతి హాసన్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ‘ద ఐ’ చిత్రంలో నటిస్తోంది. రీసెంట్లీ ఫస్ట్ లుక్ రివీల్ చేసింది యూనిట్. హాలీవుడ్ దర్శకురాలు డాఫ్నీ ష్మోన్ తెరకెక్కిస్తోన్న 'ది ఐ'లో శృతి హాసన్, మార్క్ రౌలీ, లిండా మార్లో కీ రోల్స్ చేస్తు న్నారు. డయానా పాత్రలో నటించింది శృతి హాసన్. ఎప్పుడో కంప్లీటైన ఈ సినిమా అల్రెడీ గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్క్రీనింగై ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు 'ద ఐ'ను త్వరలో ఇండియాలో కూడా రిలీజ్ చేసే అవకాశాలున్నా యి. ఇదిలా ఉండగా శృతి చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. రజనీకాంత్ కూలీతో పాటు విజయ్ సేతుపతి ట్రైన్ మూవీలో నటిస్తోంది. ఇదే కాకుండా సలార్ 2లో కూడా కంటిన్యూ కాబోతున్నదన్నది టాక్ ఉంది. ఇప్పుడు ద ఐ లోనూ నటిస్తుండటం విశేషం. మల్టీ టాలెంట్ మెండుగా ఉన్నఈ అమ్మడు ఇండియాలో ఉండాలని అనుకోవడం లేదు ఇంటర్నేషనల్ స్థాయిలో ఫ్రూవ్ చేసుకోవాలనుకుంటుంది. మరీ హాలీవుడ్ లో రాణిస్తుందో లేదో చూడాలి.

Tags

Next Story