Shruti Haasan : కూలీ సెట్స్ లో బైక్ పై శృతి హాసన్

Shruti Haasan : కూలీ సెట్స్ లో బైక్ పై శృతి హాసన్
X

పాతికేళ్ల క్రితం చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటీమణి శృతి హాసన్. కమలాహాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో దూసుకుపోతోందీ భామ. దాదాపు 45 సినిమాల్లో నటించింది శృతి. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమాలోనూ యాక్ట్ చేస్తోంది. సినిమా సెట్స్ లో పాల్గొంటూ కొన్ని ఫోటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది శృతి. కూలీ సెట్స్ లో బైక్ పై ఫోటోలకు ఫోజులిస్తూ హొయలు పోతుంది శృతి హాసన్ రజనీ కాంత్, ఉపేంద్ర, అక్కినేని నాగార్జున నటిస్తున్న ఈ సినిమాలో ప్రీతి అనే పాత్రలో కనిపించనుంది శృతి హాసన్. ఈ పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో రజినీకాంత్ , శృతి మధ్య సాగే సన్నివేశాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story