Shruti Haasan : నల్లచీరలో శృతి.. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్

విలక్షణ నటుడు కమల్ హాసన్ తనయ శృతి హాసన్. హే రామ్ సినిమాలో బాలనటిగా తెరంగేట్రం చేసిందీ అమ్మడు. ఓమై ఫ్రెండ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. గబ్బర్ సింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిందీ భామ. దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమా ఆఫర్ల కోసం ట్రై చేస్తోంది. టాలీవుడ్ లో ఆమె సినిమాకు దూరంగా ఉంది. అవకాశాలు లేకనో.. లేదంటే రాకనో తెలియదు.కానీ టాలీవుడ్ ను పూర్తిగా పక్కన పెట్టేసింది ఈ బ్యూటీ. మొన్నటి వరకు సీనియర్ హీరోల సరసన నటించింది. అయితే రీసెంట్ గా కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమాలో ఓ సాంగ్ ను పాడి అలరించింది. శృతిహాసన్ ఈ నడుమ మళ్లీ రెచ్చిపోతోం ది. సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను ఆకట్టు కుంటోంది. తాజాగా మరోసారి చీరకట్టులో మెరిసిపోయింది. ఇందులో నిండైన అందంతో మెప్పించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవు తున్నాయి. వయసు పెరుగుతున్నా సరే తన అందం ఇంచు కూడా తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపించు కుంటోందీ అమ్మడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com