Prabhas Marriage : ప్రభాస్ ప్రేమ పెళ్లి చేసుకున్నా మాకు ఓకే : కృష్ణంరాజు సతీమణి

Prabhas Marriage : టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో ఎవరంటే అందరు టక్కున చెప్పే పేరు ప్రభాస్.. యంగ్ రెబల్ స్టార్ పెళ్లి కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికి ప్రభాస్ పెళ్లి గురించి రకరకాల వార్తలు వచ్చాయి కానీ అవి కేవలం పుకార్లుగానే మిగిలిపోయాయి.
అయితే తాజాగా ప్రభాస్ పెళ్లి పైన ఆయన పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామలదేవి స్పందించారు. ప్రభాస్ పెళ్లి గురించి తమ ఇంట్లో రోజు చర్చ వస్తూనే ఉంటుందని, ప్రభాస్ ప్రేమ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నా దానికి తమ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు.
ప్రభాస్ పెళ్లి మా కుటుంబంలో పెద్ద వేడుక అని చెప్పుకొచ్చారు శ్యామల. ఇక ప్రభాస్, అనుష్కల గురించి మాట్లాడుతూ వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని వారి మధ్య అలాంటి ఫీలింగ్స్ లేవని, వారిద్దరికీ పెళ్లి అంటూ వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవమని అన్నారు.
కాగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో విక్రమాదిత్యగా ప్రభాస్ నటిస్తుండగా అతన సరసన ప్రేరణ పాత్రను పోషిస్తోంది పూజా హెగ్డే.. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సినిమా పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com