Siddharth : పుష్ప2 వ్యాఖ్యలపై సిద్ధార్థ్ క్లారిటీ

Siddharth : పుష్ప2 వ్యాఖ్యలపై సిద్ధార్థ్ క్లారిటీ
X

‘పుష్ప2’ సినిమాపై తాను చేసిన వ్యాఖ్యలకు కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలు వక్రీకరించారని ఆయన అన్నారు. ‘ఇండస్ట్రీ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. నటీనటులు, దర్శకులు, నిర్మాతలకు ఎప్పుడూ మంచి జరగాలి. కళాకారుల శ్రమకు తగ్గ ఫలితం ఉండాలి. నాకు అల్లు అర్జున్‌తో శత్రుత్వమేమీ లేదు. నేను ఎవరినీ వ్యక్తిగతంగా కానీ, ఏదో సినిమాపై కానీ ఆ వ్యాఖ్యలు చేయలేదు’ అని ఆయన స్పష్టం చేశారు. 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో జరిగింది. దానికి లక్షలాది మంది జనాలు వచ్చారు. ఆ విషయాన్ని సిద్ధార్థ్ దగ్గర ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించగా... ''ఊరిలో ఇల్లు కొల్లగొట్టడానికి జేసీబీ వస్తే జనాలు గుమిగూడారు. బీరు, బిర్యానీ ఇస్తే రాజకీయ మీటింగులకు జనాలు వస్తారని విన్నాం. అంత మంది జనాలు రావడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు'' అని ఆయన సమాధానం ఇచ్చారు.

Tags

Next Story