Sidhu : రాజా సాబ్ పోస్ట్ పోన్.. కన్ఫర్మ్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ

Sidhu :  రాజా సాబ్ పోస్ట్ పోన్.. కన్ఫర్మ్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ
X

ఒక పెద్ద సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయిందంటే.. ఆ డేట్ లో మూడు నాలుగు చిన్న సినిమాలకు స్పేస్ ఉంటుంది. అందుకే వెంటనే రియాక్ట్ అయ్యారు సిద్ధు జొన్నలగడ్డ మూవీ మేకర్స్. ప్రభాస్, మారుతి కాంబినేషన్లో రూపొందుతోన్న రాజా సాబ్ ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ మూవీ పోస్ట్ పోన్ అయిందనే వార్తలు స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి. మూవీ టీమ్ అఫీషియల్ గా చెప్పుకున్నా.. అది నిజమే అంటున్నాడు. రాజా సాబ్ గురించి సిద్ధు ఎలా చెబుతాడు.. ఎందుకు చెబుతాడు అనుకుంటున్నారు కదా. యస్.. ఆ డేట్ లో సిద్ధు సినిమా వస్తోంది కాబట్టి ఇన్ డైరెక్ట్ గా అతను రాజా సాబ్ పోస్ట్ పోన్ గురించి అఫీషియల్ అని తేల్చేసినట్టే.

టిల్లు స్క్వేర్ కూడా బ్లాక్ బస్టర్ కావడంతో సిద్ధు జొన్నలగడ్డ కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం తెలుసు కదా అనే మూవీ చేస్తున్నాడు. దీనికంటే ముందే జాక్ అనే స్టార్ట్ అయింది. జాక్ .. కొంచెం క్రాక్ అనే క్యాప్షన్ తో రూపొందుతోందీ సినిమా. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్నాడు. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. అంటే ప్రభాస్ రాజా సాబ్ రావడం లేదు అనే కదా అర్థం.

Tags

Next Story