Silk Smitha : సిల్క్ బయోపిక్

Silk Smitha : సిల్క్ బయోపిక్
X

అలనాటి అందాల నటి సిల్క్ స్మిత కు సంబంధించిన మరో బయోపిక్ వస్తోంది. 'సిల్క్ స్మిత ది క్వీన్ ఆఫ్ సౌత్' పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ బయోపికన్ను అధికారికంగా ప్రకటిస్తూ చిత్రబృందం గ్లిం పిస్ను విడుదల చేసింది. ఇందులో సిల్క్ స్మిత పాత్రలో చంద్రికా రవి నటిస్తోంది. ఈ చిత్రాన్ని జయరామ్ అనే కొత్త దర్శకుడు తీ ర్చిదిద్దుతున్నారు. తెలుగులో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి ఇది విడుదల కానుంది. ఎస్బీ విజయ్ అమృత రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 షూటింగ్ స్టార్ట్ కానుంది. గతేడాది ఆమె పుట్టినరోజు సం దర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మంచి ఆదరణ లభించింది. ఇవాళ సిల్క్ స్మిత సౌత్ క్వీన్ గురించి ప్రేక్షకులకు మరొక సారి గుర్తు చేస్తూ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్. సిల్క్ పాత్రలో చంద్రిక రవి పర్ఫెక్ట్ గా సెట్ అయిందనే టాక్ వచ్చింది. వచ్చే ఏడాది నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. గతంలో విద్యా బాలన్ లీడ్ రోల్ లో సిల్క్ స్మిత బయోపిక్ పేరుతో ' డర్టీ పిచ్చర్ ' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

Tags

Next Story