సినిమా

Siri Shrihan: సిరితో బ్రేకప్‌కు నిర్ణయించుకున్న శ్రీహాన్.. అందుకే ఇన్‌స్టాలో..

Siri Shrihan: బిగ్ బాస్ అనేది ఎవరి జీవితాన్ని అయినా మార్చేస్తుంది అంటే.. నమ్మని వాళ్లు కూడా ఉన్నారు.

Siri Shrihan (tv5news.in)
X

Siri Shrihan (tv5news.in)

Siri Shrihan: బిగ్ బాస్ అనేది ఎవరి జీవితాన్ని అయినా మార్చేస్తుంది అంటే.. నమ్మని వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు తర్వాత పరిణామాలను చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఇప్పటికే ఫేమస్ సోషల్ మీడియా కపుల్ అనిపించుకున్న షణ్నూ, దీప్తి బ్రేకప్‌కు దారితీసింది బిగ్ బాస్. మరో కపుల్ సిరి, శ్రీహాన్ కూడా బ్రేకప్‌కు దగ్గర్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.

సిరి, శ్రీహాన్ కలిసి ఎన్నో షార్ట్ ఫిల్మ్స్‌లో నటించారు. సిరికి యూట్యూబ్‌లో ప్రత్యేకంగా ఛానెల్ కూడా ఉంది. ఆ ఛానెల్ వీరిద్దరు కలిసి వెబ్ సిరీస్‌లు కూడా చేశారు. సిరి, శ్రీహాన్ కలిసి చేసిన 'మేడమ్ సార్.. మేడమ్ అంతే' వెబ్ సిరీస్ యూట్యూబ్‌లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో వీరి పెయిర్‌కు ఫ్యాన్స్ పెరిగారు. అయితే బిగ్ బాస్ అనేది వీరి బంధాన్ని పూర్తిగా మార్చేసింది అనుకుంటున్నారు నెటిజన్లు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో సిరి, షణ్నూ.. ఒకరితో ఒకరు చాలా క్లోజ్‌గా ఉన్నారు. ఫ్రెండ్స్‌గా ఉంటూ వీరి ప్రవర్తనను చాలాసార్లు ప్రేక్షకులు ఇష్టపడలేదు కూడా. బయట కూడా వీరిద్దరూ ఫ్రెండ్స్ అయినా.. బిగ్ బాస్‌లోకి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య కనెక్షన్ మరింత పెరిగిపోయిందని సిరి, షణ్నూ ఓపెన్‌గానే ఒప్పుకున్నారు. దీని వల్లే షణ్నూకు బ్రేకప్ అయిందని అందరూ అనుకుంటున్నారు.

సిరి బిగ్ బాస్ నుండి బయటికి వచ్చినప్పటి నుండి శ్రీహాన్‌ను కలవలేదు. ఇటీవల సిరి పుట్టినరోజున శ్రీహాన్ తన ఫోటోతో ఓ స్టోరీని షేర్ చేశాడు. అయితే తాజాగా శ్రీహాన్ మరో తన సోషల్ మీడియాలో సిరితో కలిసున్న ఫోటోలు అన్నింటిని డిలీట్ చేశాడు. కేవలం వీరు కలిసి చేసిన వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్‌కు సంబంధించిన ప్రమోషన్ పోస్టులు తప్ప మరేవీ శ్రీహాన్ సోషల్ మీడియాలో లేవు. దీంతో త్వరలో సిరి, శ్రీహాన్ కూడా బ్రేకప్ అయిపోనున్నారా అన్న సందేహాలు మొదలయ్యాయి నెటిజన్లకు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES