siri hanmanth : వాళ్ళది వంద రోజుల్లోనే విడిపోయేంత వీక్ లవ్ కాదు : సిరి

siri hanmanth : బిగ్‌బాస్ సీజన్ 5 మొత్తంలో షణ్ముఖ్ జశ్వంత్‌కి ఫుల్ సపోర్ట్‌గా నిలిచిన దీప్తి సునయన బయటకు వచ్చాక మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది. షణ్ముఖ్‌తో బ్రేకప్ అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అయితే వీరిద్దరూ విడిపోవడానికి సిరిని అంటూ నెటిజన్లు ఆమెను వీపరితంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
అయితే దీనిపైన తాజాగా ఆమె స్పందించింది. ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ... తనపై ట్రోలింగ్ రావడంతో డిప్రెషన్‌కి గురయ్యానని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లో వంద రోజుల్లో కంటెస్టెంట్స్ మధ్య చాలా ఎమోషన్స్ ఉంటాయని అంది.. అయితే తనకు, షణ్ముఖ్ మధ్య అది కాస్త ఎక్కువైందని చెప్పుకొచ్చింది.
కానీ అది కేవలం మాత్రమేనని పేర్కొంది. షణ్ముఖ్, దీప్తి ఇద్దరు తనకి మంచి స్నేహుతులని.. వారిద్దరూ తనవల్ల విడిపోయారని అనడం సరికాదని అంది. కేవలం వంద రోజుల్లో విడిపోయింతే వీక్ లవ్ వారిది కాదని తెలిపింది. సోషల్ మీడియాలో పుట్టించిన వాటిని తాను పుకార్లుగానే పరిగణిస్తాను చెప్పుకొచ్చింది సిరి.
అటు త్వరలోనే షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునయన త్వరలోనే కలుస్తారని, కానీ దానికి కొద్దిగా సమయం పడుతుందని షణ్ముఖ్ తండ్రి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com