Siri Hanmanth: ఒకే పార్టీలో సిరి, శ్రీహాన్.. బిగ్ బాస్ తర్వాత మొదటిసారి ఇలా..

Siri Hanmanth: బిగ్ బాస్ హౌస్ చాలామందికి సెలబ్రిటీ స్టేటస్‌ను తెచ్చిపెట్టింది. కొన్నిరోజులపాటు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అందులో ఉండే హౌస్‌మేట్స్ జీవితాలు.. చాలావరకు బయటికి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోతాయి. అలా బిగ్ బాస్ సీజన్ 5 నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా చాలామంది కంటెస్టెంట్స్ లైఫే మారిపోయింది. అందులో ఒక కంటెస్టెంట్ సిరి.
బిగ్ బాస్ హౌస్‌లో సిరి పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే మరో కంటెస్టెంట్ పేరు షణ్ముఖ్. ఈ ఇద్దరు ఫ్రెండ్లీగా ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నా.. కొన్నిసార్లు వీరు ఫ్రెండ్‌షిప్ లిమిట్ దాటిందని ప్రేక్షకులు భావించారు. అందుకే వీరిద్దరు గేమ్ బాగా ఆడి టాప్ 5 వరకు చేరుకున్నా విన్నర్ మాత్రం కాలేకపోయారు. అయితే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత సిరి, షణ్ముల పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
బిగ్ బాస్ అయిపోగానే షణ్నూకు తన గర్ల్‌ఫ్రెండ్ బ్రేకప్ చెప్పేసింది. మరి సిరి పరిస్థితి ఏంటి అని ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే తాజాగా సిరి.. తన బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్‌తో కలిసి ఓ పార్టీలో దిగిన ఫోటోను షేర్ చేసింది. 'తను నా ఓన్లీ వన్. మంచి, చెడు అన్నింటిలో నాతోనే ఉన్నాడు. తన మనసు చాలా మంచిది. తనే నాకు అన్నీ. లవ్ యూ శ్రీహాన్' అని క్యాప్షన్ పెట్టి ఇప్పటివరకు చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్‌కు ఓ క్లారిటీ ఇచ్చేసింది సిరి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com