SJ Surya : విలన్ గా ఫుల్ బిజీ అవుతున్న యస్.జే.సూర్య

కోలీవుడ్ డైరెక్టర్ కమ్ నటుడు ఎస్‌జే సూర్య ( SJ Surya ) ప్రస్తుతం హైప్రొఫైల్ సినిమాల్లో నటిస్తున్నాడు. అతను ఇప్పటికే విలన్ పాత్రల్లోనూ, అసాధారణ పాత్రలలోనూ నటించి పాపులారిటీ సంపాదించాడు. ఇటీవల "భారతీయుడు 2" లో కనిపించాడు సూర్య. ప్రస్తుతం రామ్ చరణ్ ( Ramcharan ) లేటెస్ట్ మూవీ "గేమ్ ఛేంజర్" ( Game Changer ) లో ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.
లేటెస్ట్ గా "సర్దార్ 2" సెట్స్ లో జాయిన్ అయ్యాడు. ‘సర్దార్’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పీయస్ మిత్రన్ దర్శకుడిగా కంటిన్యూ అవుతుండగా.. కార్తీ మెయిన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇంతలో చిత్ర బృందం అతన్ని మూవీలోకి స్వాగతం పలికింది.
“#Sardar2 కోసం @iam_sjsuryah సార్‌కి స్వాగతం పలకడం ఆనందంగా ఉంది. షూటింగ్ జరుగుతోంది. పూర్తి స్వింగ్‌లో ఉంది” అని టీమ్ ట్వీట్ చేసింది. ప్రెజెంట్ .. ఎస్‌జె సూర్య సినిమాలకు దర్శకత్వం వహించడం మానేసి నటుడిగా కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. అతను ఇప్పుడు దక్షిణ భారత సినిమాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న అత్యధిక పారితోషికం తీసుకునే విలన్‌లలో ఒకడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com