Prabhas Raaja Saab : ప్రభాస్ లుక్ కోసం మారుతిని డిమాండ్ చేస్తున్న ఎస్కేఎన్

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో మంచి బాండింగ్ ఉన్న ఫిల్మ్ పర్సనాలిటీస్ అంటే మారుతి, ఎస్కేఎన్, బన్నీ వాస్, సాయి రాజేష్ లను చెప్పాలి. వీళ్లు వీళ్ల సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ లో కానీ.. ఇతర మూవీస్ కు సంబంధించిన ఇన్వాల్వ్ మెంట్ లో కానీ.. చాలా జెన్యూన్ గా ఉంటున్నారు. కలిసి విజయాలు సాధిస్తున్నారు. ఒకరినొకరు మెచ్చుకుంటూ అండగా నిలుస్తూ.. దూసుకుపోతున్నారు. ఇక ఎస్కేఎన్ అయితే ఏ సినిమా ఫంక్షన్ కు అటెండ్ అయినా తనదైన శైలిలో మాటల తూటాలు వదులుతూ.. క్యూ అండ్ ఏ లలో కూడా మీడియాకే రివర్స్ కౌంటర్స్ వేస్తూ ఆకట్టుకుంటుంటాడు. అలాంటి ఎస్కేఎన్ మారుతిని ప్రభాస్ కోసం డిమాండ్ చేయడంతో టాలీవుడ్ లో చాలామంది సరదాగా తీసుకుంటూ.. ‘నిజమే’కదా అంటున్నారు.
ఇంతకీ ఎస్కేఎన్ ఏమన్నాడంటే.. ‘మరి ప్రభాస్ గారి బర్త్ డే అంటే హోర్డింగ్ లు, ఫ్లెక్స్ లు, బ్యానర్లు .. అబ్బో చాలా హంగామా ఉంటుందిగా.. మరి మనం ఎందుకు ఒక కొత్త స్టిల్ రిలీజ్ చేయకూడదు..’ అంటూ ప్రభాస్ రాజా సాబ్ డైరెక్టర్ మారుతిని, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీని ట్యాగ్ చేస్తూ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ కు ఫ్యాన్స్ అంతా ఇమ్మీడియొట్ గా రియాక్ట్ అవుతూ.. ఎస్కేఎన్ చెప్పినట్టుగా కొత్త స్టిల్ కావాలని డిమాండ్ చేస్తుండటం విశేషం. అయినా వాళ్లు వాళ్లు ముందే మాట్లాడుకునే ఉంటారు. ఇదంతా మంచి స్కీమ్. సో.. మాగ్జిమం రాజా సాబ్ నుంచి ప్రభాస్ కొత్త స్టిల్ వచ్చేసినట్టే అని ఫిక్స్ అయిపోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com