Keerthy Suresh : సో క్యూట్.. మహానటి ఫిక్స్ వైరల్

మహానటి కీర్తి సురేశ్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అందం, అభినయం, నటనతో కుర్ర కారు మదిని దోచుకుంటుంది. నేను శైలజా సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి.. ఆ తర్వాత నేను లోకల్, మహానటి, సర్కారు వారి పాట, దసరా.. ఇలా మంచి మంచి హిట్లతో తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తమిళం, మలయాళంలో కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీలతో బిజీ బిజీగా గడుపుతుంది. ఇక రీసెంట్ గానే పెండ్లి చేసుకున్న ఈ అమ్మడు.. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా దూసుకుపోతోంది. వరుస సినిమాలతో రెచ్చిపో తున్న ఈ బ్యూటీ ఇటీవలే బాలీవుడ్ మూవీ బేబి జాన్లోనూ మెరిసింది. అక్కడకు వెళ్లిన తర్వాత భారీగా అందాలను ఆరబోస్తోంది. మరోవైపు ఏ మాత్రం గ్యాప్ దొరికినా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో టచ్లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్టు పిక్స్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా మెరున్ కలర్ శారీలో చింపేసింది. కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్తో కుర్రాళ్ల మతిని చెడగొడుతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బ్యూటి ఫుల్, సో క్యూట్ అంటూ కీర్తిని అభిమానులు పొగడ్తలతో ముంచెత్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com