Vijayashanti : కొందరు హీరోయిన్లు నా ట్యాగ్‌తో బతికారు: విజయశాంతి

Vijayashanti : కొందరు హీరోయిన్లు నా ట్యాగ్‌తో బతికారు: విజయశాంతి
X

తన ‘లేడీ సూపర్‌స్టార్’ ట్యాగ్‌ను కొందరు హీరోయిన్లు తీసుకున్నారని నటి విజయశాంతి అన్నారు. వాళ్లు కూడా బతకాలి కదా అని తాను పట్టించుకోలేదని చెప్పారు. ‘హీరోలను మీరు అని సంబోధిస్తారు. కానీ హీరోయిన్లను మాత్రం నువ్వు అని అంటారు. నాకు ఇది చాలా బాధ కలిగిస్తుంది. ఇకపై హీరోయిన్లను కూడా మీరు అనే పిలవండి. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోయిన్లను మీరు అని పిలిచేవారు’ అని ఆమె గుర్తు చేశారు.

చాన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి.. మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. ఇది వచ్చిన ఐదేళ్లకు తాజాగా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు. తన పాత్రకు వస్తున్న ఆదరణ దృష్ట్యా.. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ గురించి మాట్లాడారు. ఇదే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. హీరోలని మీరు అని సంభోదిస్తున్నారని కానీ హీరోయిన్లని మాత్రం ఇండస్ట్రీలో నువ్వు అని అంటున్నారని, ఇది తనకు చాలా బాధ కలిగించిందని విజయశాంతి చెప్పుకొచ్చారు. దయచేసి ఇకపై హీరోయిన్లని కూడా మీరు అనే సంభోదించాలని కోరారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ తనని మీరు అంటూ పిలిచేవారని, అది చూసి తను ఆశ్చర్యపోయిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

Tags

Next Story