Janhvi Kapoor : ఎవరైనా నన్ను ఆపండి : జాన్వీకపూర్

Janhvi Kapoor : ఎవరైనా నన్ను ఆపండి : జాన్వీకపూర్
X

బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఎంట్రీలోనే జూ. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీలో ఆఫర్ కొట్టేసింది. సినిమాలో తన అందం, నటనతో ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ఇక దేవర పర్ఫామెన్స్ తో వెంటనే చాలా సినిమాల్లో ఆఫర్లను లైన్ లో పెట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లోనూ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఆర్సీ 16 మూవీలో హీరోయిన్ గా చాన్స్ దక్కించుకుంది ఈ బ్యూటీ. బుచ్చిబాబు డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయింది. ఇంత బిజీగా ఉన్న ఫిట్నెస్ విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటిస్తూనే ఉంటుంది. అలాగే ఆడియన్స్ తో సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ పోస్ట్ చేసింది. ఓ కప్ లో ఐస్ క్రీంతో పాటు కుకీస్ ను చూపిస్తూ 'ఎవరైనా నన్ను ఆపేయమని చెప్పండి' అంటూ రాసుకొచ్చింది. 'మన మనసుకి తినాలని ఓ వైపు అనిపిస్తున్నా మళ్లీ దీని వల్ల ఏదైనా శరీర మార్పులు వస్తే కష్టమని' తనకు తాను సర్దిచెప్పుకోలేక ఎవరైనా వద్దని చెప్పండి అని తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు జాన్వీకి ఎంత కష్టం వచ్చిందోనని కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Next Story