Sonal Chauhan: ప్రభాస్ 'ఆదిపురుష్'లో బాలకృష్ణ హీరోయిన్..

Sonal Chauhan: పాన్ ఇండియా ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క జోనర్‌లో తెరకెక్కుతున్నాయి. అందులో ముఖ్యంగా 'ఆదిపురుష్' రామాయాణ ఇతిహాసంపై ఉండబోతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్.. ఆదిపురుష్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ ఈ సినిమాకు షూటింగ్ పూర్తి చేసుకోగా.. తాజాగా ఓ యంగ్ బ్యూటీ ఆదిపురుష్ సెట్స్‌లో అడుగుపెట్టినట్టు సమాచారం.
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'లెజెండ్' లాంటి చిత్రంతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్. ఆ తర్వాత కూడా తాను తెలుగులో ఒకట్రెండు సినిమాలు చేసినా.. ఇప్పటికీ తనను లెజెండ్ హీరోయిన్‌గానే గుర్తిస్తారు ప్రేక్షకులు. ప్రస్తుతం నాగార్జున్ సరసన 'ది ఘోస్ట్' చిత్రంలో నటిస్తున్న సోనాల్.. ఆదిపురుష్‌లో ఓ కీలక పాత్ర పోషించే ఛాన్స్ కొట్టేసింది.
ఆదిపురుష్ చిత్రం భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కుతోంది. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మిణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనుండగా.. సోనాల్ చౌహాన్ కూడా ఇప్పుడు ఈ లిస్ట్‌లో యాడ్ అయ్యింది. ఇటీవల సోనాల్.. ఆదిపురుష్ సెట్స్‌లో అడుగుపెట్టింది. అంతే కాకుండా ఆ సినిమా విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంది.
తాను ఆదిపురుష్‌లో నటిస్తున్న విషయాన్ని అఫీషియల్‌గా బయటపెట్టింది సోనాల్ చౌహాన్. ఈ సినిమాలో ఒక భాగమవ్వడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు తాను చేసిన సినిమాల్లో ఇది చాలా డిఫరెంట్ అని పేర్కొంది. కచ్చితంగా ఆదిపురుష్ అందరికీ నచ్చుతుంది అని ధీమా వ్యక్తం చేసింది సోనాల్. ఇక ఆదిపురుష్ వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com