Srileela : బాధపెట్టుంటే క్షమించండి.. సారీ చెప్పిన శ్రీలీల

కిసిక్స్ గాళ్ శ్రీలీల సారీ చెప్పింది. 2024కలో ఎవరినైనా అనుకోకుండా బాధపెట్టినా, కావాలని ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టినా క్షమించమని అడిగింది. 2024 ఎంత మంచి సంవత్సరమో గుర్తు చేసుకుంటూ 2025 కి వెల్ కం చెప్పేసింది. శ్రీలీల తన అభిమానుల కోసం ఇన్స్టాలో షేర్ చేసిన విషెస్ సారాంశం ఇలా ఉంది. ఇది ఎంత మంచి సంవత్సరం!! అంటూ తన ఆనందం వ్యక్తం చేసింది శ్రీలీల. క్షమించమని చెప్పే సమయమిదని అంటోంది. మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా బాధపెట్టినట్లయితే సారీ చెప్పేయమని సూచించింది. 2024లో పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ శ్రీలీలకు జాతీయ స్థాయిలో ఇమేజ్ పెంచిందనడంలో సందేహం లేదు. ‘విశ్వానికి కృతజ్ఞతతో ఉండాల్సిన సమయం.. ప్రతిదానికీ! దయగా ఉండాల్సిన సమయం.. వైజర్ కూడా స్నానం చేసిన తర్వాత గీజర్ని స్విచ్ చేయండి.. వీటన్నింటిని కూడా మన దైనందిన దినచర్యలో భాగంగా చేసుకోవడానికి, రాబోయే అందమైన సంవత్సరంలో ప్రజలకు మంచి సంస్కరణను అందించడానికి నిజాయితీగా ఉండాల్సిన సమయం.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. దేవుడు నాకు పేరు ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రేమ.. ఎప్పుడూ దేన్నీ పెద్దగా తీసుకోలేదు ఎన్నటికీ కాదు ధన్యవాదాలు 2024' అని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com