Rahul Ramakrishna : సారీ..అల్లు అర్జున్‌పై వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా.. రాహుల్ రామకృష్ణ

Rahul Ramakrishna : సారీ..అల్లు అర్జున్‌పై వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా.. రాహుల్ రామకృష్ణ
X

హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పోలీసుల పనితీరును ప్రశ్నించడంతోపాటు నటుడు అల్లు అర్జున్‌కు అండగా నిలబడుతూ పోస్టు పెట్టిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ యూ టర్న్ తీసుకున్నారు. ‘ఎక్స్’ లో స్పందించిన రాహుల్ రామకృష్ణ.. ఆ రోజు ఏం జరిగిందో పూర్తిగా అర్థం చేసుకోకుండానే స్పందించానని, ఇప్పుడు నిజం తెలిశాక దానిని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అందరిలానే స్పందించిన రాహుల్ రామకృష్ణ.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని, లా అండ్ ఆర్డర్ వైఫల్యం కనిపిస్తోందని పేర్కొన్నారు. పబ్లిక్ ప్రదేశాలకు సెలబ్రిటీలు హాజరయ్యేటప్పుడు పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. సినిమా స్థాయిని గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎక్కుమంది వస్తారని తెలిసినప్పుడు ఆ మేరకు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని పోలీసులను ప్రశ్నించారు. అంతమందిని ఒకేసారి లోపలికి ఎందుకు అనుమతించారని నిలదీశారు. రాజకీయ పార్టీల సమావేశాల్లోనూ తొక్కిసలాట జరిగి కొన్నిసార్లు ప్రజలు మరణిస్తారని, అలాంటి వాటికి ఇంత వేగంగా ఎందుకు స్పందించరని, సినిమా విషయంలో ఇంత వేగంగా ఎందుకు స్పందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే.. అసెంబ్లీలో సీఎం, ప్రెస్ మీట్ లో పోలీసు ఉన్నతాధికారులు, యూట్యూబ్ లో వీడియో సాక్ష్యాలు అన్నీ బయటపడటంతో... ఇప్పుడు తమ వ్యాఖ్యలను సినీ సెలబ్రిటీలు వెనక్కి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

Tags

Next Story