Daisy Shaw : సౌత్ వాళ్లకు అదే పిచ్చి : డైసీ షా

Daisy Shaw : సౌత్ వాళ్లకు అదే పిచ్చి : డైసీ షా
X

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకు పోతున్న బాలీవుడ్ బ్యూటీ డైసీ షా కన్నడలో 'భద్ర' సినిమాతో హీరోయిన్ గా మారింది. తర్వాత ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన 'జై హో'లో నటించే ఛాన్స్ కొట్టేసింది. అనంతరం హేట్ స్టోరీ 3, రామ్ రతన్, రేస్ 3, మిస్టరీ ఆఫ్ ది టాటూ వంటి సినిమాలతో అలరించింది. అటు బుల్లితెరపైనా ఈ ముద్దుగుమ్మ దుమ్మురేపింది. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది. అయితే లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైసీ తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ గురించి కూడా ఓపెన్ అయ్యింది. ఈ క్రమంలోనే దక్షిణాదిలో సినిమాల షూటింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. 'ఇక్కడ హీరోయిన్ల అందాలను, నడుము, బొడ్డును చూపించే పిచ్చి ఎక్కువగా ఉంది. ఓసారి నేను ఓ కన్నడ చానెల్ చూస్తుండగా.. అందులో ఓ నటుడు హీరోయిన్ నడుముపై పండ్లు, ఐస్ ముక్కలు వేసి ఆమె నడుమును సలాడ్ గా మార్చాడు. హీరోయిన్ల నడుము, నాభి ప్రాంతాల్లో క్లోజప్ షాట్స్ పెట్టడం అన్ని ఇండస్ట్రీలలో ఉన్నప్పటికీ.. దక్షిణాదిలో ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం డైసీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరినీ ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Tags

Next Story