Squid Game 3 : 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ రిలీజ్

నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్. కొరియన్ భాషలో హ్వాంగ్ డాంగ్ హ్యుక్ తెరకెక్కించిన ఈ సిరీస్ నుంచి ఇప్పటికే రెండు సీజన్లు రాగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఫస్ట్ సీజన్ ను కేవలం 28 రోజుల్లోనే 11 కోట్ల మంది చూశారు. ఇక గతేడాది 2వ సీజన్ రాగా.. ఇది కూడా రికార్డు వ్యూస్ ను అందుకుంది. ఇక ఇప్పుడు తాజాగా సీజన్ 3 కూడా రాబోతుంది. ఈనెల 27 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈనేపథ్యంలో మూవీ టీం సర్వైవల్ థ్రిల్లర్ హర్రర్ సిరీస్ 'స్క్విడ్ గేమ్ ' సీజన్ 3 ట్రైలర్ విడుదల చేసింది. ఆసక్తికర మైన గేమ్‌లు, ప్రాణాలు కాపాడుకుంటూ క్యాష్ ప్రైజ్ కోసం కంటెస్టెంట్లు చేసే పోరాటాలు, వారి భావోద్వేగాలు ఈ సిరీస్ లో ఆకట్టుకుంటాయి. తమపై దాడికి యత్నించిన హీరోను గేమ్ నిర్వాహకులు ఎందుకు చంపకుండా వదిలేశారు? అతడిని తిరిగి గేమ్ లో ఎలా భాగం చేశారనేది ఆసక్తి కరంగా ఉండనుంది. ఈ ఆటకు ఎలాగైనా ముగింపు పలకాలనే లక్ష్యంతో ఉన్న షియెంగ్ జీ హున్.. ఫ్రంట్ మ్యాన్‌ను అంతం చేశాడా.. లేదా అనేది ఈ సీజన్లో చూపనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com