Sree Leela : వెండి రంగు చీరలో శ్రీలీల హొయలు

Sree Leela : వెండి రంగు చీరలో శ్రీలీల హొయలు
X

ఎనర్జిటిక్ డ్యాన్స్ తో బన్నీ తో కలిసి ప్రేక్షకుల ముందు రాబోతున్న నటి శ్రీలీల. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత సాంగ్ లో ఇరగదీసిన ఈ భామ పుష్ప సినిమాలో కిస్కిక్ అనే ఐటం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 5న పుష్ప - 2 విడుదల కాబతోంది. కిస్కిక్ అంటూ బన్నీ చంకనెక్కిన ఈ భామ.. ఇన్ స్టాలో హోయలు పోతూ పోజులిచ్చింది. వెండి రంగు చీరలో హొయలు పోతూ.. తన బుంగమూతి పెట్టేసింది. ఈ ఫొటోలను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లవ్ యూ బేబీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. మొదటి సినిమా డిజాస్టర్ అయినా.. ఏ మాత్రం వేయలేదు. ఆ తర్వాత మంచి ఆఫర్లు వెనుకంజ వచ్చాయి. ధమాకా సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్లో ఒక్కసారిగా టాప్ స్టార్ హీరోయిన్ గా మారి పోయింది. ఏక కాలంలో నాలుగు అయిదు సినిమాలు చేసే స్థాయికి చేరింది. ప్రస్తుతం టాలీవుడ్లోనే కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగింది.

Tags

Next Story