Sreeleela : చీరకట్టులో శ్రీలీల

Sreeleela : చీరకట్టులో శ్రీలీల
X

అందం, అభినయం, నాట్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే నటి శ్రీలీల. ముఖ్యంగా ఎనర్జెటిక్ డ్యాన్స్ తో అదరగొట్టడం శ్రీలీలకే సొంతం. నిన్న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాలకు హాజరైన శ్రీలీల స్పెషల్ లుక్ లో కనిపించింది. ఈ వేడుకకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవికి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందజేశారు. ఈ వేడుకలో శ్రీలీలతో పాటు ప్రముఖులు వెంకటేశ్, రామ్ చరణ్, నాని వంటి పలువురు సెలబ్రిటీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీలీల గోల్డెన్ క్రీమ్ రంగు చీరను ధరిస్తూ ఎరుపు రంగు బ్లౌజ్తో సంప్రదాయంలో ఆకర్షణీయంగా కనిపించారు. ఆమె చీర ధరించిన తీరు, మేకప్, జువెలరీ ఆభరణాలతో మెరిసిపోయారు. ఆమె క్యూట్ హావభావాలు అభిమానులనే కాదు, అనేక మంది సినీ ప్రముఖులను కూడా ఆకర్షించాయి. ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఆమె సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయిన అందాన్ని పొగడ్తలతో ముంచెత్తారు.

Tags

Next Story