Sri Leela : అమ్మ దెబ్బలు కొడుతుంది.. శ్రీలీల సెన్సాఫ్ హ్యూమర్

కిస్సిక్ పాటలో తన ఎనర్జటిక్ డ్యాన్సుతో అదరగొట్టిన భామ శ్రీలీల. గతేడాది రిలీజైన గుంటూరు కారం సినిమాలో కుర్చీమడత సాంగ్ పై డాన్సుతో ఉర్రూతలూగించిన ఈ అమ్మడు ఇటీవల వచ్చిన పుష్ప -2లో ఐకానిక్ స్టార్ బన్నీతో కలిసి దెబ్బలు పడతయ్ రో.. కిస్సిక్ అంటూ ఆడిపాడింది. ఈ పాట దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లోకి వచ్చింది. శ్రీలీల ఎక్కడ కనపడిన అభిమానులు, మీడియా కెమెరాలను 'కిస్సిక్ 'మనిపిస్తునారు. తాజాగా ఆమె తన తల్లితో కలిసి ఓ ఎయిర్ పోర్టులో సందడి చేసింది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇంతకీ శ్రీలీల ఏం మాట్లాడింది అంటే.. శ్రీలీల తన మదర్ తో ఎయిర్ పోర్టులో కనిపించగానే మీడియా ఫోటోలోకు పోజ్ ఇయ్యమని 'పుష్ప2' భాషలో కిస్సిక్ ప్లీజ్ అని అడిగారు. అలాగే కిస్సిక్ స్టెప్స్ చేయాలని కోరారు. దీనికిబదులుగా ఆమె 'పుష్ప 2' కిస్సిక్ స్టైల్ లోనే డ్యాన్స్ చేస్తే అమ్మ దెబ్బలు కొడు తుందని తన సెన్సాఫ్ హ్యూమర్ ప్రదర్శిం చింది. ఆమె వీడియో ఇప్పుడు ఇన్ స్టాలో వైరల్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com