Srikanth Addala : ‘కూచిపూడి వారి వీధి’లో శ్రీకాంత్ అడ్డాల

‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’తో మంచి విజయాన్ని దక్కించుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ఆ తర్వాత మళ్లీ అలాంటి విజయాన్ని అందుకోలేకపోయారు. ముకుంద, నారప్ప ఫర్వాలేదనిపించగా బ్రహ్మోత్సవం, పెదకాపు నిరాశపరిచాయి. దీంతో ఆయన మరోసారి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తరహా కుటుంబ కథను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. అక్కాచెల్లెళ్ల మధ్య సాగే భావోద్వేగాలే ఇతివృత్తంగా ‘కూచిపూడి వారి వీధి’ అన్న మూవీని తెరకెక్కిస్తున్నారని సమాచారం. పూర్తిగా గోదావరి జిల్లాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాకోసం హీరోయిన్స్ ను వెతికే పనిలో ఉన్నాడు శ్రీకాంత్. హీరోయిన్స్ ఫిక్స్ అవ్వగానే సినిమాను మొదలు పెట్టనున్నారు. నిజానికి ఓ కన్నడ హీరోతో సినిమా చేయడానికి శ్రీకాంత్ సన్నాహాలు చేశారు. కానీ ఈలోగా ఆ హీరో జైలు పాలయ్యాడు. ఆతర్వాత ఇప్పుడు మరో సినిమాను లైనప్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com