Srikanth Iyengar : క్షమాపణ చెప్పడానికి టైం అడిగిన శ్రీకాంత్ అయ్యంగార్

సినిమా రివ్యూ రైటర్స్‌పై చేసిన వ్యాఖ్యలకు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ స్పందించారు. త్వరలోనే క్షమాపణలు చెబుతానని ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఇటీవల విడుదలైన పొట్టేల్ సినిమా సక్సెస్ మీట్‌లో శ్రీకాంత్ అయ్యంగార్ సినిమా రివ్యూలు రాసే వారిపై పరుష పదజాలం వాడారు. ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం రానివాళ్లు రివ్యూలు ఇస్తున్నారని, సినిమా రివ్యూలు ఆపేయాలంటూ ఘాటుగా తిట్ల వర్షం కురిపించారు. దీనిపై సోషల్ సోషల్ మీడియాలో అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. వివరణ ఇస్తూ శ్రీకాంత్ వీడియో విడుదల చేశారు. పొట్టేల్ సినిమా సక్సెస్ మీట్‌లో నేను కొన్ని మాటలు మాట్లాడాను.. కొన్ని విషయాల్లో బాధ కలిగించాను.. త్వరలోనే క్షమాపణలు చెబుతాను.. దయచేసి వేచి ఉండండని ఎక్స్‌లో చెప్పారు శ్రీకాంత్ అయ్యంగార్. ముక్కుసూటి మాటలతో కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారిన శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణ వీడియో ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సినిమా పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. క్షమాపణలు చెప్పడానికి టైం అడగడంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com