Srileela : అజిత్ సినిమాలో శ్రీలీల

Srileela : అజిత్ సినిమాలో శ్రీలీల
X

పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీలీల. తర్వాత 'గుంటూరు కారం' మూవీలో కుర్చీమడత సాంగ్ లో తన ఎనర్జిటిక్ ఫెర్ఫార్మెన్స్ చూపిన ఈ అమ్మడు పుష్ప - 2 చిత్రంతో పాన్ ఇండియా స్థాయికి వెళ్లిపోయింది. ఆ సినిమాలో బన్నీ సరసన కిసిక్స్ అంటూ ఆడిపాడింది. అయితే ఈ భామ తాజాగా కోలీవుడ్ లో మరో అవకాశాన్ని చేజిక్కించుకున్నట్టు సమాచారం అందుతోంది. కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందబోయే నెక్స్ మూవీలో ఓ కీలక పాత్ర కోసం శ్రీలీలను సంప్రదించినట్లు తెలు స్తోంది. ఈ ప్రాజెక్ట్ శ్రీలీల చేరితే, తమిళ ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రధాన నాయికగా శ్రీనిధి శెట్టి ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, కథలోని మరో ముఖ్యమైన మహిళా పాత్ర కోసం శ్రీలీల పేరును పరిశీలిస్తున్నార ని కోలీవుడ్ తెలుస్తోంది. ఇదే నిజమైతే శ్రీలీల కెరీర్ కు మరో పెద్ద బూస్ట్ అవుతుంది.

Tags

Next Story