Srileela : పుష్ప2 కోసం శ్రీలీల రెమ్యూనరేషన్ 2 కోట్లు

Srileela : పుష్ప2 కోసం శ్రీలీల రెమ్యూనరేషన్ 2 కోట్లు
X

బన్నీ, సుకుమార్ కాంబోలో వస్తున్న ప్యాన్ ఇండియా మూవీ 'పుష్ప2 ది రూల్'. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐకాన్హాస్టార్ అల్లు అర్జున్ తో.. డ్యాన్సింగ్ క్వీన్ శ్రీ లీల జతకడుతోంది.. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ స్పెషల్ మాసివ్ కిస్సిక్ సాంగ్ను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. అయితే, ఈ సాంగ్లో శ్రీలీల డ్యాన్స్ చేసినందుకు ఎంత తీసుకుంది ? అనే టాక్ టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. పుష్ప 1లో నటించిన సమంత ' అంటావా' సాంగ్కా ఏకంగా రూ.5 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుందని వార్తలు వచ్చాయి. మరి బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ ను కాదని శ్రీలీలను తీసుకోవడంతో ఏ మేరకు ఇచ్చారు అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు కిస్సిక్ సాంగ్ కోసం శ్రీ లీల రూ.2 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుందట. ఈ సాంగ్ ఓ రేంజ్లో ఉంటుందని, శ్రీలీల డాన్స్ అదరగొట్టినట్టు యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

Tags

Next Story