Srileela : పారితోషికాన్ని భారీగా పెంచేసింది శ్రీలీల..7 కోట్లు!

Srileela : పారితోషికాన్ని భారీగా పెంచేసింది శ్రీలీల..7 కోట్లు!
X

అందం, అభినయం, అంతకు మించి ఎనర్జిటిక్ డ్యాన్స్ తో ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ను సం పాదించుకున్న హీరోయిన్ శ్రీలీల. పుష్ప - 2 సినిమాలో ఐటం సాంగ్ కి సిక్స్ తర్వాత ఈ అమ్మడి స్థానం ఎక్కడికో వెళ్లిపోయింది. వరుస సినిమాలు క్యూ కట్టాయి. దీంతో ఈ అమ్మడు పారితోషికాన్ని భారీగా పెంచేసిందట. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఈ స్టార్ హీరోయిన్ రెమ్యూనరేషన్ ను డబుల్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. శ్రీలీల గతంలో ఒక్కో సినిమాకు రూ.3.5 నుంచి 4 కోట్ల వరకు తీసుకునేదట. ఇకపై ఒక్క ప్రాజెక్టుకు దాదాపు రూ. 7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యిందని తెలుస్తోంది. కిస్సిక్ స్పెషల్ సాంగ్ చేశారు. ఈ పాటలో కేవలం డ్యాన్స్ చేసేందుకు రూ. 2 కోట్లు తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు బయటికి వచ్చాయి. దీనిపై ఎక్కడా శ్రీలీల స్పందించలేదు.

Tags

Next Story