Srileela : ఫేక్ న్యూస్ ప్రచారంపై శ్రీలీల వీడియో

సమాజంలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయి. అందుకు సంబంధించి నటీనటులతో ప్రచారం చేపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫేక్ న్యూస్, అసత్యాలు ప్రచారం, డీప్ ఫేక్ వంటి అంశాలపై ఏపీ ప్రభుత్వం నజర్ పెట్టింది. ఈ క్రమంలోనే స్టార్ నటి శ్రీలీలతో అసత్య ప్రచారాలపై వీడియో చేసింది. తప్పుడు ప్రచారాలు చేయొద్దని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం ఇంకొకరిని ఇబ్బంది పెట్టొద్దని తెలపింది. 'అసత్య ప్రచారాలకు దూరంగా ఉందాం. సామాజిక బాధ్యత వహిద్దాం' అంటూ పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి.అయితే తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికి, తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. రీసెంట్గా తమిళ స్టార్ అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీలో హీరోయిన్గా సెలెక్ట్ అయిందనే వార్తలొచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com