Srinidhi Shetty: ఆ రెండింటిపైనే శ్రీనిధి శెట్టి ఆశలు

Srinidhi Shetty: ఆ రెండింటిపైనే శ్రీనిధి శెట్టి ఆశలు
X

కథల విషయంలో అతి జాగ్రత్త ఒక్కో సారి కెరీర్ ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. అది సరిగ్గా శ్రీనిధి శెట్టి విషయంలో నిజమైందనే చెప్పాలి. కె.జి.ఎఫ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఆ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఆ తర్వాత అమ్మడు కోబ్రా సినిమా చేసింది. ఆ సినిమా ఎన్నో అంచనాలతో వచ్చినా వర్క్ అవుట్ కాలేదు. తర్వాత కొన్ని కథలకు ఆమె నో చెప్పింది. బాగా గ్యాప్ తర్వాత ఈ అమ్మడు రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. వాటిలో న్యాచురల్ స్టార్ నానితో హిట్ 3 ఒకటి కాగా.. మరొకటి సిద్ధు జొన్నలగడ్డతో నటిస్తున్న తెలుసు కదా. ఈ రెండు సినిమాల తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది శ్రీనిధి శెట్టి. తన క్యూట్ లుక్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు కెరీర్ ప్లానింగ్ ఏంటన్నది ఎవరికీ తెలియట్లేదు. ఈ రెండు సినిమాల్లో నాని హిట్ 3 ఊర మాస్ సినిమాగా వస్తుంది. ఈ సినిమాలో శ్రీనిధి క్యూట్ లుక్స్ ఆకట్టు కుంటున్నాయి. ఇక సిద్దు తెలుసు కదా సినిమాలో శ్రీని ధితో పాటు రాశి ఖన్నా కూడా ఒక హీరోయిన్ గా నటిస్తుంది. సో ఈ రెండు సినిమాల ఫలితాలను బట్టి శ్రీనిధి తెలుగు కెరీర్ ఆధారపడి ఉంటుంది.

Tags

Next Story