SSMB 29 : ఎస్ఎస్ఎంబీ 29 .. 1,000 కోట్ల ఖర్చు!?

SSMB 29 : ఎస్ఎస్ఎంబీ 29 .. 1,000 కోట్ల ఖర్చు!?
X

ప్రిన్స్ మహేశ్ బాబు, గ్లోబర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబీ 29. ఈ సినిమా కోసం దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా ఉంటుందనే కథనాలు వస్తున్నాయి. ఈ మూవీలో హాలీవుడ్ తార ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. రాజమౌళి పవర్ ఫుల్ కథ, పాన్ వరల్డ్ మేకింగ్ కు.. మహేష్ బాబు సింహంలాంటి లుక్ తోడైతే.. హాలీవుడ్ బాక్సాఫీస్ లు కూడా బ్లాస్ట్ అవ్వడం ఖాయం అని అంటున్నా రు ఫ్యాన్స్. ఇటీవలే మహేశ్ బాబు ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ లుక్ లో వేటకు సిద్ధమైన సింహంలా కనిపిస్తున్నాడు ప్రిన్స్. ఎస్ఎస్ఎంబీ 29 కోసం ప్రియాంక చోప్రా చాలా హార్డ్ వర్క్ చేస్తోంది. ఈ సినిమాలో పీసీ విలన్ గా నటిస్తోందనే టాక్ ఉంది. ఇందుకు సంబందించిన లుక్ టెస్ట్ కూడా ఫినిష్ చేశారట. ఈ సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీని తీసుకునేందుకు పరిశీలిస్తున్నారని సమాచారం. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ను ఈ పాన్ ఇండియా సినిమాలో ఓ రోల్ కోసం సంప్రదింపులు చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఏది ఏమైనా ఎస్ఎస్ఎంబీ 29పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags

Next Story