Samantha : తలెత్తుకొని నిలబడితే.. సోషల్ మీడియాలో సమంత పోస్టు వైరల్

చైతుతో విడిపోయిన తర్వాత, తనకు ఉన్న ఆరోగ్య సమస్యలతో దాదాపు కొన్ని నెలలపాటు ఎంతో ఇబ్బంది పడింది మలయాళ బ్యూటీ సమంత. ఏడాదిపాటు నటనకు దూరమైంది. ఇప్పుడిప్పుడే తన సెకండ్స్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తాజాగా ఆమె నటించిన హన్ని బన్నీ సిటాడెల్ సిరీస్ కు మంచి టాక్ వచ్చింది. ఇక సమంత ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతోంది. ఈ మధ్య సామ్ ఎంతో పరిణితిగా ఆలోచిస్తోంది. ఎక్కడికెళ్లినా ధైర్యంగా కనిపిస్తోంది. తన పోస్టులతో ఆందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా తన ఇన్ స్టా అకౌంట్ లో అటువంటిదే ఓ కవిత రాసి పోస్ట్ చేసింది. 'మిమ్మల్ని అందరూ నిందిస్తున్నప్పుడు.. మీరు తలెత్తుకుని నిలబడితే.. మగవారు మిమ్మల్ని అవమానించినప్పుడు.. మిమ్మల్ని మీరు నమ్మితే.. రిస్క్ చేసి ఓడిపోయావా? .. కొత్త ప్రయాణం మొదలు పెట్టు. అంతేకాని ఓటమి గురించి ఆలోచిస్తూ కూర్చోకు. హృదయాన్ని కఠినం చేసుకో.. సుదీర్ఘ ప్రయాణానికి ధైర్యంగా కదులు.. నీ దగ్గర ఏమీ లేనప్పుడు సంకల్పమే నిన్ను నడిపిస్తుంది. అప్పుడు నిన్ను నిందించేవారికి సైతం సమాధానం చెప్పొచ్చు' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com