Star Singer Wedding : పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్ అర్మాన్ మాలిక్

సింగర్ అర్మాన్ మాలిక్ తన ప్రేయసి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆశ్న ష్రాఫ్‌ను పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి ఫొటోలను అర్మాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రియురాలికి మ్యాచ్ అయ్యేలా అర్మాన్ పేస్టల్ షేడ్ కలర్ షేర్వాణి ధరించి రాయల్‌గా కనిపించాడు. ఇక ఈ సడన్ సర్‌ప్రైజ్ చూసిన అభిమానులు.. ఓ మైగాడ్, మీ పెళ్లికోసం ఎంత ఎదురుచూశామో.. మొత్తానికి ఒక్కటయ్యారు, కంగ్రాట్స్ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అర్మాన్, ఆష్నా ఆరేళ్లపాటు ప్రేమలో మునిగి తేలాక 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇది జరిగిన రెండేళ్లకు వీరు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల సినిమాలకు ఆయన పాటలు పాడారు. తెలుగులో బుట్ట బొమ్మ, అనగనగనగా అరవిందట తన పేరు, బ్యూటిఫుల్ లవ్ వంటి సాంగ్స్ ఆలపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com