మహాకవి యోగి వేమన నిజంగానే బట్టలు లేకుండా ఉండేవారా?

Yogi VemanA
X

Yogi Vemana Photo Source Wikipedia

Yogi Vemana: యోగి వేమన.. సాహిత్యంలో వేమన శతకాలకు ప్రత్యేక స్థానం ఉంది.

Yogi Vemana: యోగి వేమన.. సాహిత్యంలో వేమన శతకాలకు ప్రత్యేక స్థానం ఉంది. మేమన జీవితం గురించి సినిమాల్లో చూపించింది మాత్రమే చాలా మందికి తెలుసు. వేమన తన గురువు విశ్వకర్మయోగి దగ్గర ధ్యాన,జ్ఞాన,విద్యను అభ్యసిస్తాడు. ముందుగా విశ్వకర్మయోగి శిష్యూడు అభిరాముడు అభ్యసించాల్సిన ధ్యాన,,,జ్ఞాన,విద్యను అనుకొని పరిస్తితుల్లో వేమన వింటాడని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే గురు వద్ద విద్య పొందలేక పోయానని అభిరాముడు బోరున విలపిస్తాడు. అది చూసిన వేమన దానికి అభిరామా దుఃఖించకు నువ్వు పొందవలసిన దాన్ని దైవం క్రీడలో భాగంగా నేను పొందడం జరిగింది. గురువు విశ్వద...అభిరామా ఇద్దరూ చెబుతూ వుంటే వేమన్న వింటున్నట్టుగా ప్రపంచానికి తెలియపరుస్తాను అని అభిరాముడితో చెబుతాడు. అలాగే శతాకాల్లో కూడా విశ్వదాభిరామా వినురావేమా..! అనే పదం వచ్చిదని చరిత్రకారులు చెబుతారు.

అయితే వేమన చెప్పిన పద్యాన్ని అనుస‌రించి వేమన బట్టలు త్యజించాడ‌ని చెబుతారు. ఆ పద్యం ఇదే

తల్లిగర్భమందు దా బుట్టినప్పుడు

మొదల బట్ట లేదు తుదను లేదు

నడుమ బట్ట గట్ట నగుబాటు గాదటో?

విశ్వదాభిరామ వినుర వేమ!

వేమ‌న క‌వి ఆట‌వెల‌ది ప‌ద్యాల‌తో స‌మాజంలోని కుళ్లును క‌డిగిన హేతువాది. అయితే వేమన చిత్రం ఎక్కడ చూసిన దుస్తులు లేకుండా నగ్నంగా ఉంటుంది. మ‌రి నిజంగానే వేమ‌న బట్టలు ధరించలేదా? అనే సందేహం అందిరికి కలుగుతుంది. వాస్తవానికి వేమ‌న కాలమే ఓ ప్రశ్నార్థకం. ఆయన కావ్యాల్లో వాడిన ప‌దాల‌ను బ‌ట్టి చరిత్రకారులు 17వ శ‌తాబ్దంగా ఒక అభిప్రాయానికి వ‌చ్చారు. వేమన గురించి అధ్యాయనం చేసిన సిపి బ్రౌన్ , ఆరుద్ర వంటి మహాకవులు వేమన ఓ దిగంబ‌రుడ‌ని ఎక్కడ పేర్కొన‌లేదు. 1920 ప్రాంతంలో తంజావూర్ లోని స‌ర‌స్వతి మ‌హ‌ల్ లో ఉన్న చిత్రాన్ని ఆధారంగా రెడ్డివాణి ప‌త్రిక‌లో వేమ‌న దిగంబ‌ర బొమ్మ ప్రచురింపబడింది. అయితే వేమన దిగంబరుడు అనే విషయంపై క్లాారిటీ లేదు.

Tags

Next Story