Actor Sudeep Pandey : నిమా షూటింగ్ లో కుప్పకూలిన సుదీప్ పాండే.. హార్ట్ ఎటాక్‌తో స్పాట్ డెడ్

Actor Sudeep Pandey : నిమా షూటింగ్ లో కుప్పకూలిన సుదీప్ పాండే.. హార్ట్ ఎటాక్‌తో స్పాట్ డెడ్
X

ప్రముఖ భోజ్ పురి నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు సుదీప్ పాండే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ముంబయిలో ఓ సినిమా షూటింగ్లో ఉండగానే అతడు హార్ట్ ఎటాక్ తో కుప్పకూలారు. అప్రమత్తమైన మూవీ టీమ్ వెంటనే అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే సుదీప్ మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. సుదీప్ మరణ వార్త విషయాన్ని అతడి సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించారు. కాగా, సుదీప్ పాండే 2007లో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. 'భోజ్ పురి భయ్యా' అనే సినిమాతో యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఓ పక్క హీరోగా సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

Tags

Next Story